telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో ఒక చిత్తు కాగితం.. చెత్త బుట్టలో వేయడానికే

uttam congress mp

టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో ఒక చిత్తు కాగితమని.. చెత్త బుట్టలో వేయడానికి కూడా పనికి రాదని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో చూసి..నిర్ఘాంత పోయానన్నారు. 2014 నుండి ఇచ్చిన ఏ ఒక్క మేనిఫెస్టోకి సార్థకత లేదని… కేసీఆర్ ది పచ్చి మోసం…దగా అని ఫైర్‌ అయ్యారు. డబుల్ బెడ్ రూమ్ విషయంలో నిసిగ్గుగా మాట్లాడుతున్నారని… గతంలో చెప్పినవి దగా… మోసం మాటలని మండిపడ్డారు. ట్యాంక్ బండ్ లో నీళ్లు కొబ్బరి నీళ్లు చేస్తా అన్నారని… ఇప్పుడు దాని గురించి మాట్లాడడని ఫైర్‌ అయ్యారు. హెయిర్ కటింగ్ సెలూన్ లకు ఉచిత కరెంట్ అని చాలా సార్లు చెప్పాడని… హైదరాబాద్ లో లక్ష ఇండ్లు ఇస్తానని..ఒక్క ఇళ్లయిన ఇచ్చాడా..? అని ప్రశ్నించారు. ఏడేండ్లుగా అధికారంలో ఉండి.. కాలువలు..డ్రైనేజీ ని కూడా సెట్ చేయలేకపోయారని… మూసి ని శుద్ధి చేస్తా అని 2014 నుంచి చెప్తున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో ప్రజలను మోసం చేయడానికేనని అన్నారు. తాగు నీరు ఇన్నాళ్లు ఉచితంగా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. మోటార్ వెహికల్ టాక్స్ ఇప్పుడు గుర్తొచ్చిందా..? ఎన్నికలు దగ్గర పడ్డాయి కాబట్టి గుర్తొచ్చాయా..? అని ప్రశ్నించారు.

Related posts