telugu navyamedia
సినిమా వార్తలు

“పటాస్”కు బ్రేకిచ్చిన శ్రీముఖి

Srimukhi

ప్ర‌స్తుతం బుల్లితెరపై అస‌సూయ‌, ర‌ష్మి త‌ర్వాత తనదైన శైలిలో ప్రేక్ష‌కుల‌ని ఆకట్టుకుంటున్న బొద్దుగుమ్మ యాంక‌ర్ శ్రీముఖి. చిన్న చిత‌కా సినిమాల‌లో న‌టించిన ఈ బ్యూటీకి పెద్ద‌గా క్రేజ్ రాలేదు. “ప‌టాస్” షోతో ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయింది. యూత్ లో “రాముల‌మ్మ‌”గా శ్రీముఖి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. “ప‌టాస్” షోలో శ్రీముఖి త‌న మాట‌ల‌తోనే కాదు గ్లామ‌ర్‌తోను అల‌రించింది. “ప‌టాస్” సూపర్ హిట్ కావడానికి శ్రీముఖి కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఇటీవలే మళ్ళీ శ్రీముఖి, ర‌వి హోస్ట్‌గా “ప‌టాస్ 2” కూడా మొదలయ్యింది. అయితే ఈ బొద్దుగుమ్మ తాజాగా విడుదల చేసిన వీడియో వైరల్ గా మారింది. “ప‌టాస్” షోకి కొద్ది రోజులు తాను బ్రేక్ ఇవ్వ‌బోతున్న‌ట్టు ఈ వీడియో ద్వారా తెలిపింది శ్రీముఖి. నిర్వాహకుల అనుమతితోనే తాను బ్రేక్ తీసుకుంటున్నన్నట్టు పేర్కొంది. త‌న‌ని ఇంత‌గా ఆద‌రించిన బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి కూడా ఈ విష‌యం తెలియాల‌నే ఈ వీడియో చేస్తున్న‌ట్టు తెలిపింది శ్రీముఖి. ప‌టాస్ షో త‌న హృద‌యానికి చాలా ద‌గ్గ‌రైంద‌ని చెబుతూ, నిర్మాణ సంస్థ మ‌ల్లెమాల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసింది. మ‌రి శ్రీముఖి కొన్నాళ్ళు బ్రేక్ తీసుకోవ‌డంతో “ప‌టాస్” స్టేజ్‌పై ర‌వికి జోడీగా ఏ యాంకర్ అల‌రిస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది.

Related posts