telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చట్టం ఎవరి చుట్టమూ కాదు… జబర్దస్త్‌ టీంకు షాక్ ఇచ్చిన రోజా

మార్చి 4వ తేది విశాఖపట్నం మాధవదారలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందని పోలీసులకు పక్కా సమాచారం అందడంతో వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ డీఎస్పీ ఆధ్వర్యంలో దాడులు జరుపగా జబర్దస్త్‌ కామెడీ షో నటులు దొరబాబు, పరదేశి పట్టుబడ్డిన సంగతి తెలిసిందే. వారి నుంచి 18 వేల నగదును కూడా సీజ్ చేశారు.రైడింగ్‌లో పట్టుబడ్డ జబర్దస్త్ నటులు దొరబాబు, పరదేశి పోలీసుల చేత జబర్దస్త్ షో జడ్జి, ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాకు ఫోన్ చేయించారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పరదేశి వీడియోలు తీయోద్దంటూ, తమను వదిలేయమంటూ పోలీసులను కాళ్లు పట్టుకుని మరీ బ్రతిమాలాడు. చివరకు జబర్దస్త్ జడ్జి రోజా చేత చెప్పిస్తే వింటారోమోనని పోలీసుల చేత ఆమెకు కాల్ చేయించగా ‘ఇలాంటి విషయాల్లో తాను ఎటువంటి సహాయం చేయబోనని పలుకుబడి చేత ఇలాంటి వాళ్లకి హెల్ప్ చేస్తే అది అలుసుగా తీసుకుంటారు. ఒక మహిళగా ఇలాంటి పనులుచేసే వారిని నేను ప్రోత్సహించను. చట్టం ఎవరి చుట్టమూ కాదు.. మీ పద్ధతిలో మీరు ఇన్వెస్టిగేట్ చేయండి ’ అంటూ రోజా పోలీసులకు చెప్పారని సమాచారం.

Related posts