telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ చివరి చిత్రం “దిల్ బేచారా” కథ ఇదే…!

Dil-bechara

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ చివరిగా నటించిన చిత్రం ‘దిల్‌ బేచారా’. ఈ సినిమాలో సుశాంత్‌కు జోడిగా సంజనా సంఘి నటించారు. ఈ సినిమా 2014లో హాలీవుడ్ లో వచ్చిన ‘ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’కు ఈ సినిమా రీమేక్ గా తీశారు.  క్యాస్టింగ్ డైరెక్టర్ ముఖేశ్ చాబ్రా తొలిసారిగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు. తాజాగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై విడుదలైన ఈ సినిమా కోసం సుశాంత్ అభిమానులు ఎంత‌గానో వేచిచూశారు. విషాద‌ర‌క‌మైన థీమ్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో మైనీ పాత్ర‌లో సుశాంత్ క‌నిపిస్తాడు. అతను దివ్యాంగుడైన‌ప్ప‌టికీ స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటూ కాలం వెళ్ల‌దీస్తుంటాడు. ఈ నేప‌ధ్యంలోనే మైనీకి థైరాయిడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బెంగాలీ అమ్మాయి కీజీ బసు ప‌రిచ‌య‌మ‌వుతుంది. ఆమె త‌నతో ఎప్పుడూ ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ క్యారీ చేస్తుంటుంది. అయితే మైనీ ప‌రిచ‌యంతో ఆమె జీవితం ఆనందమ‌యంగా మారుతుంది. మ‌ర‌ణంతో పోరాడుతున్న వీరిద్ద‌రూ మ‌రింత స‌న్నిహితం అవుతారు. కీజీ ప్ర‌తీ కోరికనూ తీర్చేందుకు మైనీ ప్ర‌య‌త్నిస్తాడు. త‌రువాత క‌థ ప‌లు మ‌లుపులు తిరుగుతుంది. సీరియ‌స్‌గా సాగిపోయే ఈ సినిమాలో వినోదం త‌క్కువ‌గానే క‌నిపిస్తుంది. ఏఆర్ రెహ‌మాన్ సంగీతం ఎంత‌గానో ఆకట్టుకుంటుంది.

Related posts