telugu navyamedia
సినిమా వార్తలు

బాహుబలి నాముందు మోకరిల్లాడని మోకరిల్లాడన్పించింది : చుంకీ పాండే

Chunki-Pandey

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “సాహో”. సుజిత్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్పెష‌ల్ డ్యాన్స్‌తో అల‌రించ‌నుంది. బాలీవుడ్ నటులు నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ ఇతర కీలక పాత్రల్లో న‌టించారు. ఈ సినిమా ఈ నెల 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్‌లో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా భారీ విడుదలకు సిద్ధమవుతోంది. “బాహుబలి” తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంపై ఓ రేంజ్ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ సినిమాలో నటించిన బాలీవుడ్ నటుడు చుంకీ పాండే మాట్లాడుతూ… ప్రభాస్ క్రమశిక్షణ కలిగిన నటుడని, అతడు సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరినీ మర్యాదగా పిలుస్తాడనీ, అంత స్టార్‌డమ్ ఉన్నా చాలా సాధారణంగా ఉంటాడని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో ప్రభాస్ నా ముందు మోకాళ్లపై కూర్చుంటాడు. ఆ సమయంలో నాకు బాహుబలి నాముందు మోకరిల్లాడనిపించిందని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు.

Related posts