telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విజయ్ దేవరకొండతో డేటింగ్… రష్మిక రియాక్షన్ ఇదీ…!

Rashmika

“ఛలో” సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేసులో దూసుకెళ్తోంది. విజయ్ దేవరకొండ సరసన “గీతగోవిందం” సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. వెండి తెరపై ఈ జంటకు తెలుగు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. దీంతో మళ్ళీ ఈ విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి “డియర్ కామ్రేడ్” చిత్రం చేశారు. ఈ సినిమా సంగతి ఎలా ఉన్నా… విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. విజయ్‌తో డేటింగ్‌లో ఉండడం వల్లే రక్షిత్‌తో జరిగిన ఎంగేజ్‌మెంట్‌ను రష్మిక బ్రేక్ చేసుకుందని కన్నడ అభిమానులు విమర్శిస్తుంటారు. అయితే తమ మధ్య ఏమీ లేదని ఇప్పటికే వీరిద్దరూ క్లారటీ ఇచ్చారు. అయినా ఆ వార్తలు ఆగడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మికకు ఈ ప్రశ్న మరోసారి ఎదురైంది. `విజయ్‌తో డేటింగ్‌లో ఉన్నారా?` అని రష్మికను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రష్మిక స్పందిస్తూ.. `ఈ ప్రశ్నకు చాలా సార్లు సమాధానం చెప్పా. విజయ్ నాకు మంచి స్నేహితుడు మాత్రమే. అంతకు మించి మా ఇద్దరి మధ్య ఏమీ లేదు” అని స్పష్టం చేసింది. ప్రస్తుతం మహేష్ సరసన “సరిలేరు నీకెవ్వరు” చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది రష్మిక.

Related posts