telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కమల్ కు లెగ్ సర్జరీ… నెల రోజులు విశ్రాంతి

Kamal-Hassan

సినీ నటుడు, మక్కళ్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్ నవంబ‌ర్ 22న మ‌రో స‌ర్జ‌రీ చేయించుకొని కాలిలో ఉన్న స్టీల్ ప్లేట్స్ తీయించుకోనున్న‌ట్టు క‌మ‌ల్ పార్టీ వ‌ర్గాలు మీడియాకి తెలిపాయి. శుక్ర‌వారం ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో శ‌స్త్ర చికిత్స విజ‌యవంతంగా ముగిసింది. ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు ఆయ‌న‌ని ప‌రామ‌ర్శించేందుకు ఆసుప‌త్రికి క్యూ క‌డుతున్నారు. 2016లో జ‌రిగిన ప్ర‌మాదానికిగాను రెండు లెగ్ స‌ర్జ‌రీలు చేయించుకున్న సంగ‌తి తెలిసిందే. నిజానికి ఈ స‌ర్జరీ ఎప్పుడో చేయించుకోవల‌సి ఉన్నప్ప‌టికి, సినిమాలు, రాజ‌కీయాల‌తో ఉన్న బిజీ వ‌ల‌న వాయిదా ప‌డింది. ఉల‌గ‌నాయ‌న్ క‌మ‌ల్ హాస‌న్ ఇటీవ‌ల భార‌తీయ సినిమాలో 60 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న విష‌యం తెలిసిందే. నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్న క‌మ‌ల్ ఆ త‌ర్వాత ఇండియ‌న్ 2 చిత్ర షూటింగ్‌లో పాల్గొన‌నున్నారు.

Related posts