telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బీజేపీ పార్టీ కొమ్మనే షర్మిల పార్టీ : జగ్గా రెడ్డి

Jagga Reddy MLA

షర్మిల కొత్త పార్టీ పెడుతున్నారనే సంకేతాలు రావడంతో ఇటు తెలంగాణ అటు ఏపీ రాజకీయాల్లోనూ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అయితే తాజాగా వైఎస్‌ షర్మిల కొత్త పార్టీ పెడుతున్నారనే వార్తలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్‌ అయ్యారు. బీజేపీ అనే మర్రిచెట్టు నాలుగో కొమ్మనే షర్మిల పార్టీ అని.. రాజశేఖర్ రెడ్డి పేరును నిలబెట్టాలని అనుకుంటున్న వైఎస్ షర్మిల కాంగ్రెస్ తో కలసి పనిచేయవచ్చు కదా ? అని ప్రశ్నించారు. వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టి తప్పు చేస్తున్నారని.. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. విభజన తర్వాత ఈ పార్టీల లొల్లి ఎందుకు…మళ్లీ ఉమ్మడి రాష్ట్రం చేయండి అని జగ్గారెడ్డి మండిపడ్డారు. బిజెపి స్క్రిప్ట్ ను కేసీఆర్ ఫాలో అవుతున్నారని… వైఎస్ షర్మిల పార్టీపై కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదు ? ఆయన నోరు ఏమైంది ? అని నిలదీశారు. హైదరాబాద్ ఏమైనా పొలిటికల్ టూరిస్ట్ స్పాటా ? అంటూ ఫైర్‌ అయ్యారు. కేసీఆర్, వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్, వైఎస్ షర్మిలలు అమిత్ షా వదిలిన బాణాలని జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు.

Related posts