telugu navyamedia
సినిమా వార్తలు

ప్రముఖ హాలీవుడ్ నటుడు బ్రేన్ డెన్నీ కన్నుమూత

hollywod

అల‌నాటి హాలీవుడ్ హీరో హీరో బ్రేన్ డెన్నీ ఏప్రిల్ 15న త‌న స్వ‌గృహంలో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఈయన వయసు 81 సంవత్సరాలు. 70వ దశకంలో హాలీవుడ్‌ను ఉర్రూతలూగించారు బ్రేన్ డెన్నీ. ఆయన నటించిన ఫ‌స్ట్ బ్ల‌డ్‌, రోమియో అండ్ జూలియ‌ట్ ఆ రోజుల్లో భారీ హిట్ సినిమాలుగా నిలిచాయి. నాలుగు ద‌శాబ్ధాల పాటు టీవీ షోలు కూడా చేశారు.1996లో రోమియో జూలియట్ సినిమాలో రోమియో తండ్రిగా నటించి గోల్డెన్ గ్లోబ్ అవార్డు పొందారు. బ్రేన్ డెన్నీ భార్య పేరు జెన్నీఫర్. ఈ దంపతులకు కార్‌మాక్, కూతురు ఎలిజ‌బెత్ ఉన్నారు. ఆయ‌న మ‌ర‌ణంతో కుటుంబ స‌భ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా ఈ కరోనా కల్లోల సమయంలో మరణించిన ఆయనది సహజ మరణమే అని, కరోనా డెత్ కాదని చెప్పారు కుటుంబ సభ్యులు. బ్రేన్ డెన్నీ మరణించడం హాలీవుడ్ సినీ ఇండస్ట్రీని విషాదంలో ముంచెత్తింది.

Related posts