telugu navyamedia
సినిమా వార్తలు

ఎన్టీఆర్ ఇంటి వ‌ద్ద ఫ్యాన్స్ అర్థ‌రాత్రి హంగామా..

*ఎన్టీఆర్‌ అభిమానులపై హైదరాబాద్‌ పోలీసులు లాఠీఛార్జీ..

*కొంద‌రు అభిమానుల‌కు అదుపులోకి తీసుకున్న పోలీసులు..

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ అభిమానులపై హైదరాబాద్‌ పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. నేడు ఎన్టీఆర్‌ 39వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి ఫ్యాన్స్  గురువారం అర్థరాత్రి ఆయ‌న ఇంటి ముందుకి  భారీగా తరలివచ్చారు.

ఆ సమయంలో ఎన్టీఆర్‌ ఇంట్లో లేకపోవడంతో.. ఆయన రాకకోసం రోడ్డుపైనే ఎదురుచూశారు. ఈ క్రమంలో కొంతమంది అభిమానులు కేక్‌ కట్‌ చేసి.. జై ఎన్టీఆర్‌ అంటూ రోడ్డుపై హడావుడి చేశారు.

ఎన్టీఆర్ ఇంటికి భారీగా అభిమానులు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది..దీంతో అటువైపు వెళ్తున్న వాహనదారులకు ఇబ్బంది ఏర్పడింది.

సమాచారం తెలుసుకున్న పోలీసులు..ఎన్టీఆర్‌ ఇంటివద్దకు చేరుకొని..అభిమానులను పక్కకు తరలించే ప్రయత్నం చేశారు.ఫ్యాన్స్‌ అంతా వెళ్లిపోవాలని ఆదేశించినా.. పట్టించుకోకుండా డాన్స్‌ చేస్తూ రచ్చరచ్చ చేశారు.

ఫ్యాన్స్ అల్లరి శ్రుతి మించడంతో  పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. కొంతమంది అభిమానులను అదుపులోకి కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.

Related posts