telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

అల్లరి నరేష్ ‘నాంది’ సినిమాతో నంది అందుకుంటాడా…?

మొదటి నుండి ఒకే జోనర్ సినిమాలు చేస్తూ వస్తున్న హీరో అల్లరి నరేష్. అందువల్లే ఆయన సినిమా అంటేనే దాదాపు అందరికి కామెడీనే గుర్తుకొస్తుంది. నరేష్ కూడా సీరియస్ పాత్రలను అంతగా ఎంచుకోలేదు. అయితే ఇటీవల నరేష్, విజయ్ కనకమేడల దర్శకత్వంలో నూతన ప్రయోగం చేయనున్నాడు. ఈ సినిమా పేరు ‘నాంది’గా ఖరారు చేశారు. ఇందులో స్పెషల్ ఏంటనుకుంటున్నారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ పూర్తి స్థాయిలో సీరియస్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో అల్లరి నరేష్ పూర్తి న్యూడ్‌గా కూడా కనిపించాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. కానీ థియేటర్లు తెరుచుకోకపోవడం వల్ల సినిమా విడుదల ఆలస్యం అవుతుంది. ఈ సినిమాకు పలు ఓటీటీలు మంచి ఆఫర్లు ఇచ్చినా దానిపై ఆలోచిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తాన్ని కూడా ఆఫర్ చేసిందని సమాచారం. అయితే ఒకవేల థియేటర్లు తెరుచుకుని ఉన్నా కామెడీ హీరో నరేష్ సీరియస్ చేశాడా అని, దానికి తోడు నరేష్ ప్లాప్‌లలో ఉన్నాడు దాంతో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి ఈ సినిమా చూస్తారన్న నమ్మకం తక్కువగానే ఉంది. దాంతో ఓటీటీపై చిత్ర యూనిట్ మొగ్గుచూపుతుందని సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాతోనైనా అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో చేసి నందీ అవార్డును అందుకోవాలని అనుకుంటున్నారు.

Related posts