telugu navyamedia
సినిమా వార్తలు

అల్లూరి విగ్రహావిష్కరణ : భీమవరం చేరుకున్న చిరంజీవి

మెగాస్టార్ చీరంజీవి బీమ‌వ‌రం చేరుకున్నారు. మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 వ‌జ‌యంతి వేడుక‌ల్లో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ, గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో క‌లిసి ఆయ‌న‌ విగ్రహ ఆవిష్కరణకు పాల్గొన‌నున్నారు.

కాగా అంత‌కుముందు చిరంజీవి హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమహేంద్రవరంలో మధురపూడి విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సంధర్భంగా చిరంజీవిని అభిమానులు పూల దండలతో ముంచెత్తారు.

చిరంజీవిని చూసేందుకు వందల సంఖ్యలో అభిమానులు చేరుకుని ఆయనకు స్వాగతం పలికేందుకు వచ్చారు. విమానాశ్రయం వద్ద తొక్కిసలాట జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.

Related posts