telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

కామెడీని వదలని మహేష్…

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన దూకుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దూకుడు సినిమాలో ఎక్కువగా క్లిక్ అయిన వాటిలో కామెడీ కూడా ఒకటి. అయితే అప్పటినుండి మహేష్ ప్రతి సినిమాలోనూ కామెడీ ట్రాక్ ను వదలడం లేదు. గత ఏడాది సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ అయిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా ఎక్కువగా మహేష్ పాత్ర కామెడీ ట్రాక్ లో నడిచింది. ఇక సూపర్ స్టార్ మహేష్ చేస్తున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మహానటి కీర్తి సురేస్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దుబాయ్‌లో కొనసాగుతోంది. ఈ సినిమా బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కనుంది. అయితే ఇప్పుడు అయితే కాబట్టి సర్కారు వారి పాట సినిమాలో దూకుడు తరహా కామెడీ ట్రాక్ ఉండే అవకాశాలు ఉన్నాయన వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి వచ్చే ఏడాది సంక్రాంతికి ఇడుదల కానున్న ఈ సినిమా ఎంతమేర అభిమానులను అలరిస్తుంది అనేది.

Related posts