telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆగిపోయిన “గుర్తుందా శీతాకాలం”

Tamannah

యంగ్ హీరో సత్య దేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా కన్నడలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లవ్ మాక్ టైల్’ సినిమాను తెలుగు లో ‘గుర్తుందా శీతాకాలం’ టైటిల్ తో రీమేక్ చేయనున్నారు. స్వీయ నిర్మాణంలో నాగశేఖర్‌ ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. దీనికి సంబంధించి జూలైలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని అప్పట్లో నాగశేఖర్ ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ పూర్తిగా ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ప్రకటించిన దగ్గర నుంచీ ఇప్పటి వరకు చాలా వదంతులు వినిపించాయి. ఈ సినిమా కోసం మొదట తక్కువ రెమ్యునరేషన్ మాట్లాడుకున్న సత్యదేవ్.. ఆ తరవాత ఎక్కువ డిమాండ్ చేస్తున్నారని రూమర్లు వచ్చాయి. మహేష్ కోనేరుకు చెందిన ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్‌లో ‘తిమ్మరుసు’ అనే సినిమా చేస్తోన్న సత్యదేవ్.. అక్కడ కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని, అంతే మొత్తాన్ని ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాకు ఆయన డిమాండ్ చేస్తున్నారని వదంతులు వ్యాపించాయి.

Related posts