telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్-3 ఫైనల్స్ కు అతిథిగా చిరు…?

chiranjeevi

బిగ్ బాస్ సీజ‌న్ 3 స‌క్సెస్‌ఫుల్‌గా వంద ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. మ‌రో ఐదు రోజుల‌లో ఈ కార్య‌క్ర‌మానికి ఎండ్ కార్డ్ ప‌డ‌నుంది. 17 మంది స‌భ్యుల‌తో మొద‌లైన బిగ్ బాస్ జ‌ర్నీలో ప్ర‌స్తుతం ఐదుగురు స‌భ్యులు మాత్ర‌మే మిగిలారు. వీరిలో ఒక‌రు విజేత‌గా నిల‌వ‌నున్నారు. ఆ విజేత ఎవ‌ర‌నే దానిపై ప్ర‌స్తుతం హాట్ హాట్ డిస్క‌ష‌న్స్ న‌డుస్తున్నాయి. అయితే గ‌త‌వారం శివ‌జ్యోతి ఎలిమినేట్ కాగా, ఈ వారం ఎలాంటి నామినేష‌న్ ప్ర‌క్రియ‌లు ఉండ‌వు. ఈ ఆదివారం బిగ్‌బాస్ ఫైన‌ల్ విన్న‌ర్ ఎవ‌రో తేలిపోనున్నారు. శ్రీముఖి, బాబా భాస్క‌ర్‌, అలీరెజా, రాహుల్‌, వ‌రుణ్ సందేశ్‌లు ఫైన‌ల్‌కు చేరుకున్నారు. ఈ ఫైన‌ల్‌ను గ్రాండ్ లెవ‌ల్లో నిర్వ‌హించ‌డానికి నిర్వాహ‌కులు ప్లాన్స్ చేస్తున్నార‌ట‌. విన‌ప‌డుతున్న స‌మాచారం మేర‌కు బిగ్‌బాస్ నిర్వాహ‌కులు ఈ ఫైన‌ల్‌కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవిని ర‌ప్పించడానికి గ‌ట్టిగానే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని టాక్‌. మ‌రి వారి కోరిక‌ను మ‌న్నించి చిరు ముఖ్య అతిథిగా వ‌స్తారో లేదో చూడాలి.

Related posts