telugu navyamedia
సినిమా వార్తలు

మీడియాపై పరోక్షంగా సమంత సెటైర్!

అక్కినేని కోడలు సమంతపై గత కొన్ని రోజులు సోషల్‌ మీడియా రూమర్స్‌ వస్తున్నాయి. అయినప్పటికీ దీనిపై ఏమాత్రం స్పందించను అని చెబుతూ వ్యూహాత్మక నిశ్శబ్దం పాటిస్తోంది. అయితే అప్పుడప్పుడు పరోక్షంగా తనని విమర్శించే వారిపై సెటైర్స్ కూడా వేస్తోంది సమంత. ఆ మధ్య సమంత సోషల్ మీడియా అకౌంట్స్ లోని తన పేరులోంచి అక్కినేని అనే పదాన్ని తొలగించింది. దాంతో నెటిజన్లతో పాటు కొన్ని సోషల్ మీడియా సైట్స్ సైతం సమంత, నాగ చైతన్య మధ్య ఏమైనా విభేదాలు తలెత్తాయేమో అనే సందేహాలను వ్యక్తం చేశాయి. అప్పుడు సమంత మౌనం వహించింది తప్పితే తన నిర్ణయానికి కారణం మాత్రం చెప్పలేదు.

తాజాగా ఇదే అంశంపై కొన్ని వెబ్ సైట్స్ లో వార్తలు వచ్చాయి. అయితే నాగార్జున బర్త్ డే సందర్భంగా ఆయనకు విషెస్ తెలియచేసిన సమంత అక్కినేని కుటుంబంతోనే తాను ఉన్నాననే రీతితో ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చింది. అంతేకాదు… ఇటీవల ఓ ఉత్తరాది పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ తనపై వస్తున్న రూమర్స్ కు వివరణ ఇవ్వడం తనకు ఇష్టం లేదని, సమయం, సందర్భం వచ్చినప్పుడే వాటిపై స్పందిస్తానని స్పష్టం చేసింది.

చిత్రం ఏమంటే… సమంత ఇచ్చిన హింట్స్ తో మీడియా దాదాపు సైలెంట్ అయ్యింది. కానీ ఆమెకు ఈ రూమర్స్ కారణంగా నిద్ర కరువైనట్టుగా కనిపిస్తోంది. ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ప్రతి రోజూ దీనికి సంబంధించిన ఏదో ఒక కొటేషన్ ను పోస్ట్ చేస్తూ వస్తోంది. తాజాగా మీడియా వాస్తవాలను ఎలా వక్రీకరిస్తుందో తెలియచేస్తూ ఓ ఫోటోను పెట్టింది. పై భాగంలో ఓ కుక్క క్రూరంగా పొడవాటి కోరల్లాంటి పళ్ళతో భయంకరంగా కనిపిస్తూ ఉంది. దాని కిందే రెండు కుక్కలు క్యూట్ గా, హ్యాపీగా ఉన్నాయి. మీడియా సత్ సంబంధాలను సైతం చాలా క్రూరంగా చూపుతోందనే అర్థం వచ్చేలా ఈ ఫోటో ఉంది. ఇది తన వ్యక్తిగత జీవితం విషయంలో రియాలిటీలో జరుగుతున్న దాన్ని.. మీడియా వక్రీకరించి చూపిస్తోందని సమంత పరోక్షంగా సెటైర్ వేస్తున్నట్లు అర్థం అవుతుంది. ఏదేమైనా సమంత తన పర్సనల్ లైఫ్ గురించి వస్తున్న రూమర్స్ పై సమంత వెంటనే క్లారిటీ ఇచ్చి వార్తలకు చెక్ పెడితే బాగుంటుందని అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు.

Related posts