telugu navyamedia
సినిమా వార్తలు

50 సంవత్సరాల “మనుషుల్లో దేవుడు”

నటరత్న పద్మశ్రీ ఎన్.టి.రామారావు గారు నటించిన మరొక సాంఘిక చిత్రం శ్రీ భాస్కర చిత్ర వారి “మనుషుల్లో దేవుడు” 05-04-1974 విడుదలయ్యింది.

నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య గారు శ్రీ భాస్కర చిత్ర బ్యానర్ పై దర్శకుడు బి.వి.ప్రసాద్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రాన్నికి కధ: పుండరీకాక్షయ్య, స్క్రీన్ ప్లే: బి.వి.ప్రసాద్, మాటలు: గొల్లపూడి, పాటలు: సి.నారాయణ రెడ్డి, కొసరాజు, దాశరధి, సంగీతం: టి.వి.రాజు మరియు ఎస్.హనుమంతరావు,ఫోటోగ్రఫీ: జె.సత్యనారాయణ, కళ: మాధవపెద్ది గోఖలే, నృత్యం: వెంపటి చిన సత్యం, కూర్పు: కందస్వామి అందించారు.

ఈచిత్రంలో ఎన్.టి. రామారావు, వాణిశ్రీ, బి.సరోజాదేవి, అంజలీదేవి, కృష్ణంరాజు, గుమ్మడి , విజయలలిత, రేలంగి,  ధూళిపాళ, రాజబాబు, రత్న, సాక్షిరంగారావు తదితరులు నటించారు.

ఈ చిత్రనిర్మాణ సమయంలో సంగీత దర్శకులు టి.వి.రాజు గారు మృతి చెందటం తో సాలూరి హనుమంతరావు గారు సంగీత దర్శకుడు గా బాధ్యతలు స్వీకరించి చిత్రాన్ని పూర్తి చేశారు.

వీరి సంగీత సారధ్యంలో జాలువారిన పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి.
ఈ చిత్రంలో ప్రధానంగా;”వరూధిని-ప్రవరాఖ్యుల గేయ నాటకం” చిత్రాన్ని కి హైలైట్ గా నిలిచింది. 15 నిమిషాల నిడివి గల “వరూధినీ – ప్రవరాఖ్య” గేయ నాటిక ను కలర్ లో చిత్రీకరించారు
“హల్లో మేడం హల్లో మేడం”
“ఏ రేఖ శశిరేఖ కోపమా తాపమా”
“గోపాల నను పాలింపగ రావా”
“చెట్టంత మగవాడు చెంతనే ఉన్నాడు”
వంటి పసందైన పాటలు ప్రేక్షకులను అలరించాయి.

నందమూరి తారక రామారావు కుమార్తె భువనేశ్వరి ఈ సినిమాలో “గోపాల నను పాలింప రావా” అనే పాటలో శ్రీకృష్ణుడుగా నటించారు.

ఈ చిత్రం ఘన విజయం సాధించి 20 కేంద్రాలలో 50 రోజులు, రెండు కేంద్రాలలో షిఫ్ట్ ల పై (విజయవాడ, హైదరాబాద్) 100 రోజులు ప్రదర్శింపబడింది. ఈ సినిమాను హిందీలో “ఉధార్ కా సింథూర్” పేరు తో రీమేక్ చేసి 15-10-1976 న విడుదల చేయగా ఆ సినిమా కూడా విజయం సాధించింది.

Related posts