telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్‌లో సింగర్ గా మారనున్న అలియా ?

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ “‘రౌద్రం రణం రుధిరం”. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో సీత పాత్రలో రామ్‌‌చరణ్‌కు జోడీగా ఆలియా నటిస్తోంది. అలాగే ఎన్టీఆర్ సరసన బ్రిటీష్ భామ పాత్రలో హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుంది.  ఈ సినిమాను 2021 అక్టోబర్‌ 13న రిలీజ్‌ చేయనున్నట్లు ఈ సినిమా యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.  ఈ సినిమా గురించి సినీ సర్కిల్స్‌లో అనేక వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా మరో వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమాలో జక్కన్న అలియా పాత్రకు ఓ స్పెషల్ పాటను ప్లాన్ చేశారంట. ఈ పాట దాదాపు క్రీపు 5వ శతాబ్దం బ్యాక్ డ్రాప్‌లో ఉండనుందంట. ఈ పాటను అలియా భట్ స్వయంగా పాడారంట. అలియా ఇంతకు ముందే కొన్ని హిందీ పాటలు కూడా పాడారు. అలియా పాడిన కొన్ని పాటలు భారీ హిట్‌లుగా కూడా నిలిచాయి. ఇప్పుడు మళ్లీ అలియా ఆర్ఆర్ఆర్‌కు తన స్వరం అదించనున్నారు. ఈ సినిమా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్‌టీఆర్ హీరోలుగా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related posts