telugu navyamedia
సినిమా వార్తలు

తమిళనాడు సీఎం స్టాలిన్‌ని కలిసిన చిరంజీవి

టాలీవుడ్ సూపర్ స్టార్ చిరంజీవి నేడు చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తమిళనాడు సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత స్టాలిన్ తనదైన శైలిలో పాలన చేపడుతూ, అందరి అభినందనలు అందుకుంటున్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన స్టాలిన్ కొన్ని నెలల వ్యవధిలోనే ఉత్తమ సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్ ను చెన్నైలోని నివాసంలో కలిశారు.

స్టాలిన్ పాలన అద్భుతమంటూ స్టాలిన్ కు పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పారు. ఈ సందర్భంగా అక్కడ స్టాలిన్ తనయుడు, కోలీవుడ్‌ హీరో ఉదయనిధి కూడా ఉన్నారు. ఈ ఫొటోలను చిరంజీవి తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇక ఇటీవలే పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాన్‌ కూడా స్టాలిన్ పాలన అద్భుతమంటూ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే.

Related posts