telugu navyamedia
సినిమా వార్తలు

“బిచ్చగాడు2″బ్లాక్ బాస్ట‌ర్ సీక్వెల్..

కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు విజయ్ ఆంటోని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. భిన్న చిత్రాలకు విజయ్ ఆంటోని కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. విజయ్ ఆంటోని హీరోగానే కాకుండా నిర్మాత, సంగీత దర్శకుడిగా ఇలా భిన్న క్రాఫ్ట్‌ల్లో తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఎడిటర్‌గా కూడా అయన కొన్ని సినిమాలకు పనిచేయగా ప్రస్తుతం తొలిసారి అయన దర్శకత్వం అవ‌తార‌మెత్తారు.

Vijay Antony to put on director's hat for 'Bichagadu 2'

బిచ్చ‌గాడు..ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌లై బాక్సాపీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామి సృష్టించిన కోలీవుడ్ సినిమా. తెలుగు, త‌మిళంతో వివిధ భాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. విజ‌య్ ఆంటోనీ హీరోగా న‌టిస్తూ స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కించిన ఈ చిత్రానికి శ‌శి దర్శ‌క‌త్వం వ‌హించాడు. స‌త్నా టైట‌స్ హీరోయిన్ గా న‌టించింది. సుదీర్ఘ కాలం త‌ర్వాత‌ ఈ క్రేజీ సూప‌ర్ హిట్ చిత్రానికి సీక్వెల్ కు అంతా సిద్ద‌మైంది.

Is Pichaikkaran 2 On Cards? - Desimartini

బిచ్చ‌గాడు 2 ఇవాళ సెట్స్ పైకి వెళ్ల‌నున్న‌ట్టు కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. చెన్నైలో బిచ్చ‌గాడు 2 షూటింగ్ మొద‌లు కానున్న‌ట్టు టాక్‌. ఈ చిత్రాన్ని విజ‌య్ ఆంటోనీయే డైరెక్ట్ చేస్తుండ‌టం విశేషం. నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తూ భారీ స్థాయిలో సినిమాను రూపొందించేందుకు స‌న్నాహాలు చేస్తున్నాడ‌ట‌. ఆస‌క్తిక‌ర విష‌య‌మేంటంటే సీక్వెల్ లోని కొంత భాగాన్ని హైద‌రాబాద్ లో కూడా షూట్ చేయ‌నున్నారు. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన ఏర్పాట్ల‌ను కూడా చిత్ర‌యూనిట్ పూర్తి చేసింద‌ని టాక్ వినిపిస్తోంది.

Related posts