telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

188 అడుగుల నయగారా ఫాల్స్ లో పడిపోతే…!?

Niagara-Falls

నయగారా ఫాల్స్‌ ను ఫొటోలోనో, వీడియోలోనో చూస్తేనే గుండెలు దడలాడతాయి. మరి అందులో పడిపోతే…. అమెరికాలో ఉండే ఈ నయగారా ఫాల్స్ ఎత్తు 188 అడుగులు. నయగారా ఫాల్స్‌ మొత్తం మూడు రకాలుగా ఉంటుంది. హార్స్ షూ ఫాల్స్, అమెరికన్ ఫాల్స్, బ్రైడల్ వీల్ ఫాల్స్. ఈ మూడింటిలో హార్స్ షూ ఫాల్స్ అంచుల్లో నిలబడిన ఓ వ్యక్తి అనుకోకుండా అక్కడి నుంచి జారి కింద నదిలో పడిపోయాడు. మంగళవారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. అక్కడున్న వారు పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వడంతో.. వారు వ్యక్తి ఆచూకీ కోసం నది కింద వైపుకు వెళ్లారు. నదిలో పడిపోయిన వ్యక్తి కింద ఓ గట్టు మీద చిన్న చిన్న గాయాలతో కూర్చొవడాన్ని రెస్క్యూ టీం గమనించి అతడిని కాపాడింది. నదిలో పడిపోయిన సమయంలో ఓ పెద్ద గోడ తనకు కనిపించిందని ఆ గోడను పట్టుకుంటూ గట్టుపైకి చేరానని వ్యక్తి తెలిపాడు. అయితే ఆ వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు చెప్పారు. కాగా అక్కడి నుంచి కింద పడిన వారు ఇలా ప్రాణాలను దక్కించుకోవడం ఇది నాలుగో సారి అని అధికారులు తెలిపారు.

Related posts