telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కరోనా కట్టడికి టర్కీలో.. వయసును బట్టి ఆంక్షలు!

turkey

కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. పర్యాటక కేంద్రాలకు ప్రసిద్ధిగాంచిన టర్కీ దేశంలో కరోనా వైరస్ విలయాతాండవం చేయడంతో కళకళలాడే అనేక టూరిస్ట్ స్పాట్లు ఇప్పుడు నిర్మానుషంగా మారాయి. టర్కీలో ఇప్పటికే 78 వేల మందికి వైరస్ సోకగా.. 17 వందల పైచిలుకు మరణాలు సంభవించాయి. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా టర్కీ ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించింది.

లాక్‌డౌన్, కర్ఫ్యూ ఆంక్షలపై ఆ దేశం భిన్నమైన నిర్ణయాలు తీసుకుంటోంది. వయసుల వారీగా ఆంక్షలు విధిస్తోంది. వారాంతం మినహా మిగతా రోజుల్లో 20 ఏళ్ల లోపువాళ్లు, 60 ఏళ్లు దాటినవాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దని ఆదేశించింది. 20 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్నవాళ్లు బయటకు వెళ్లొచ్చని సూచించింది.నిర్మాణ రంగం, పరిశ్రమలకు ప్రభుత్వం అనుమతించింది. బ్యాంకులు కొన్ని గంటలు పని చేసేందుకు వీలు కల్పించింది.

Related posts