తమిళ యంగ్ హీరో శింబు అనారోగ్యంతో శనివారం చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నాడు. ‘వెందు తనిందదు కాడు’ అనే సినిమా షూటింగ్‌లో కొన్ని వారాలపాటు బిజీగా ఉన్న శింబు గొంతు నొప్పి, జ్వరంతో హాస్పిటల్‌లో చేరడంతో కరోనా అయ్యి ఉండవచ్చని ప్రచారం జరిగింది.
దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులూ , సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు. అయితే అతనికి కరోనా రాలేదని సన్నిహితులు స్పష్టం చేశారు. శింబు ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేవలం వైరల్ ఇన్ఫెక్షన్ అని వైద్యులు అభిమానులకు భరోసా ఇచ్చారు.
ప్రస్తుతం శింబు ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి తొలి షెడ్యూల్ ఇప్పటికే ముంబైలో పూర్తయ్యింది. తాజా షెడ్యూల్ చెన్నయ్‌లో జరుగుతోంది. శింబు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో ఈ మూవీ షూటింగ్‌కు బ్రేక్ పడినట్లుగా తెలుస్తోంది.
కాగా తమిళ స్టార్ అయిన శింబు మన్మధ, వల్లభ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ‘వల్లభ’, ‘మన్మధ’ వంటి ప్రేమకథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకూ చేరువయ్యాడు. ఇటీవలే రిలీజైన ‘మానాడు’ తెలుగులో ‘ది లూప్‘ పేరుతో అనువదించారు.