telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన స్టార్‌ నటి

బుల్లితెర నటిగా కెరీర్ మొదలుపెట్టిన హరితేజ ఆ తరువాత యాంకర్‌గా, వెండితెర నటిగానూ తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంది. కెరీర్ ఆరంభంలో అవకాశాల కోసం ఎంతగానో కష్టపడ్డ హరితేజ…ఆఫర్లు వచ్చిన తరువాత మాత్రం వెనుతిరిగి చూసుకోలేదు. అ..ఆ సినిమాలో మంగమ్మగా ఫన్నీ క్యారెక్టర్‌లో కనిపించిన హరితేజ, ఆ తరువాత బిగ్ బాస్ రియాల్టీ షోలో తళుక్కుమంది. తృటిలో హరితేజ బిగ్ బాస్ టైటిల్‌ను మిస్ చేసుకున్నప్పటికీ, ఆ షో ద్వారా కావాల్సినంత గుర్తింపును సాధించింది. ప్రస్తుతం వరుస సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉన్న హరితేజ తాజాగా పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. బిగ్ బాస్ సీజన్ 1లోనూ పార్టిసిపేట్ చేసిన హరితేజ వివాహం 2015లో దీపక్ తో అయ్యింది. గత యేడాది తన ప్రెగ్నెన్సీ గురించి హరితేజ సోషల్ మీడియాలో తెలిపింది. అప్పటి నుండీ ఎప్పటికప్పుడు తన ప్రెగ్నెన్సీ ఫోటో షూట్స్ తో అభిమానులకు టచ్ లోనే ఉంది. ఏప్రిల్ 5న ఆడపిల్లకు జన్మనిచ్చిన విషయాన్ని ‘ఇట్స్ బేబీ గర్ల్’ అంటూ హరితేజ తన భర్తతో ఉన్న ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దాంతో నెటిజన్లు ఆమెను అభినందనలతో ముంచెత్తుతున్నారు. 

Related posts