ఒకపక్క దేశం మొత్తం బీజేపీ గాలి వీస్తుంటే, మరోపక్క అసహనంతో దాడులు కూడా.. యూపీలోని ఘజియాబాద్ జిల్లా మసూరికి చెందిన బీజేపీ నేతను కొందరు దుండగులు పట్టపగలు తుపాకీతో కాల్చిచంపారు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. బీజేపీ నేత బీఎస్ తోమర్ తన కార్యాలయంలో ఉండగానే కొందరు దుండగులు బైక్ పై అక్కడకు చేరుకున్నారు. అనంతరం ఆఫీసు లోపలకు వెళ్లి తోమర్ పై ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు.
కాల్పుల శబ్దం విన్న సిబ్బంది రక్తపు మడగులో పడిపోయిన తోమర్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో ఉండగానే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో తోమర్ హత్యపై కేసు నమోదుచేసిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు గాలింపును ముమ్మరం చేశారు.