యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “సాహో”. సుజిత్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్‌లో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా భారీ విడుదలకు సిద్ధమవుతోంది. “బాహుబలి” తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంపై ఉన్న అంచనాలు కారణంగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగినట్లు వార్తలు వినపడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై ఓ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండడంతో అభిమానులు తొలి రోజే ఈ సినిమాని వీక్షించేందుకు పోటీలు పడుతున్నారు. బాహుబలి తర్వాత నేషనల్ స్టార్‌గా మారిన ప్రభాస్ తన తాజా చిత్రం సాహోని భారీ రేంజ్‌లో ప్రమోట్ చేసుకుంటున్నాడు. ముఖ్యంగా హిందీలో ప్రముఖ టీవీ రియాలిటీ షోస్ అన్నింటికి హాజరై తన సినిమాకి సంబంధించిన విషయాలు షేర్ చేసుకుంటున్నాడు. రీసెంట్‌గా సల్మాన్ ఖాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న “నచ్ బలియే-9” డ్యాన్స్ రియాల్టీ షోలో పాల్గొన్నారు ప్రభాస్. షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న ప్రముఖ నటి రవీనా టాండన్ చీర కొంగును నోటితో పట్టుకుని.. ‘కిక్’ సినిమాలోని ‘జుమ్మేకీ రాత్ హై..’ పాటకు స్టెప్పులు వేశారు ప్రభాస్. వాటికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్లర్లు కొడుతున్నాయి. ప్రభాస్.. కపిల్ శర్మ షోలోను శ్రద్ధాతో కలిసి సందడి చేసిన విషయం తెలిసిందే.
previous post