telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

తెలంగాణలో లిక్కర్ షాపులపై నేడు కీలక నిర్ణయం!

KCR cm telangana

తెలంగాణలో లిక్కర్ షాపులపై సీఎం కేసీఆర్ నేడు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇక నిన్న ఉదయం నుంచి రాత్రి వరకూ పలువురు మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులకు ఫోన్ చేసిన కేసీఆర్, లాక్ డౌన్ సడలింపులు, తదుపరి పర్యవసానాలపై చర్చించారు. నేడు మరికొందరి మనోగతాలను తెలుసుకుని, ఆపై నిఘా వర్గాల నుంచి అభిప్రాయాలను స్వీకరించి, మద్యం షాపులపై ప్రభుత్వ నిర్ణయాన్ని వెలువరిస్తారని తెలుస్తోంది.

లాక్ డౌన్ మూడో విడతను ప్రకటించిన కేంద్రం, మరో రెండు వారాలు నిబంధనలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు కొన్ని నిబంధనలను సడలించింది. వైన్స్ షాపులను ఓపెన్ చేసేందుకు అంగీకరించింది. ఇంతవరకూ నిత్యావసరాల డెలివరీకి మాత్రమే అనుమతి ఉన్న ఈ-కామర్స్ సంస్థలు అన్ని రకాల వస్తువులను డెలివరీ చేసేందుకు కూడా అనుమతులిచ్చింది.

Related posts