telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ .. ప్రైవేట్ పరం.. అదనపు ఆదాయమే లక్ష్యం..

secunderabad railway station record

రైల్వేశాఖ ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషిస్తున్న నేపథ్యంలో ప్రధాన నగరాల్లోని స్టేషన్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలన్న నిర్ణయంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రైల్వే కార్మిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రైల్వే నిర్ణయం కనుక అమలై స్టేషన్లు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే ప్రయాణం తడిసి మోపెడు అవడం ఖాయం.

దక్షిణమధ్య రైల్వే ప్రధాన స్టేషన్ల నిర్వహణతోపాటు ప్లాట్‌ఫాం టికెట్ల విక్రయం, పారిశుద్ధ్య నిర్వహణ, పార్కింగ్ వంటి సేవలను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని నిర్ణయించింది. ‌సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ఇప్పటికే ఇండియన్‌ రైల్వే స్టేషన్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎస్‌డీసీ)కి అప్పగించింది. దీంతోపాటు ఇతర జోన్లలో ఉన్న మరికొన్ని స్టేషన్లు కూడా ఐఆర్‌ఎస్‌డీసీ చేతిలోకి వెళ్లిపోయాయి. స్టేషన్లను ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టడం వల్ల ఉద్యోగాలు తగ్గిపోవడంతోపాటు ప్రయాణికులపై భారం పడుతుందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రైల్వే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నేడు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.

Related posts