telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“జగమే తంత్రం” అంటున్న ధనుష్

DHanush

కోలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ ధనుష్, యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కలయికలో.. వై నాట్ స్టూడియోస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా.. ‘డి 40’ (ధనుష్) ప్రముఖ నిర్మాత ఎస్. శశికాంత్ నిర్మిస్తోన్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌తో పాటు మోషన్ పోస్టర్ తాజాగా విడుదల చేశారు. తమిళ్‌లో ‘జగమే తంతిరమ్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో ‘జగమే తంత్రం’ పేరుతో విడుదల కానుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ధనుష్ రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తున్నాడు. ఆయన పక్కన ఐశ్వర్యా లక్ష్మీ కథానాయిక. సంతోష్ నారాయణన్, ఆర్ఆర్ బాగుంది. సమ్మర్ స్పెషల్‌గా 2020 మే 1న తమిళ్, తెలుగు భాషల్లో భారీగా విడుదల చేయనున్నారు.

Related posts