telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ సామాజిక

సొంత కూతురుతోనే “హనీ ట్రాప్”… తండ్రి నిర్వాకం

Honey

ఈ ఘటన బెంగుళూరులో జరిగింది. డేటింగ్‌ యాప్‌ను ప్రారంభించి, 21 ఏళ్ల తమ కుమార్తెను ఓ వైద్యుడికి ఎరగా వేసి అతడి నుంచి ఐదు నెలల్లో రూ.42 లక్షలు కాజేశారు బెంగళూరుకు చెందిన దంపతులు. తమ కుమార్తెతో ఏకాంత ఫొటోలు, వీడియోలు చూపి వైద్యుడి నుంచి మరో రూ.కోటి డిమాండ్‌ చేసి దొరికిపోయారు. ‘మీ కుమారుడి కారణంగా మా అమ్మాయి గర్భం దాల్చింది. మరింత డబ్బు కట్టండి’ అంటూ పదేపదే బెదిరిస్తుండడంతో వైద్యుడి తల్లి పోలీసులను ఆశ్రయించారు. వారు కూపీ లాగితే డేటింగ్‌ యాప్‌ వెలుగు చూసింది. సొంత కూతూరినే డేటింగ్‌లోకి దించడం పోలీసులను విస్మయ పరిచింది. దీనిపై వారు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts