పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రికార్డు స్థాయిలో కలెక్షన్లు కూడా సాధించింది.
మలయాళంలో ఘన విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రానికి రీమేక్‌గా సాగర్ కె.చంద్ర దర్శకుడు తెరకెక్కించారు. ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా నిత్యామీనన్, రానాకు జోడీగా సంయుక్తా మీనన్ నటించిన సంగతి తెలిసిందే.
పవన్‌కల్యాణ్ ఇమేజ్‌కు తగినట్లు దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించారు. ఇది ఓటీటీలో విడుదల అవుతుందని తెలియగానే ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. డేట్ కోసం వేయి కళ్లతో వేచిచూశారు. మార్చి25న ‘డిస్నీ హాట్ స్టార్’, ‘ఆహా’లు ఒకే రోజు ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించాయి. దీంతో అభిమానులకు పండగ మొదలైంది.
భీమ్లానాయక్ విడుదలై కేవలం నెలరోజుల్లోనే ఓటీటీలోకి నిర్మాతలు విడుదల చేయనున్నారు. మార్చి25న ఈ సినిమాను ఒకేసారి డిస్నీ+ హాట్‌స్టార్‌తో పాటు ఆహాలో రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు ‘ఆహా’ భీమ్లా నాయక్’ ట్రైలర్‌ను స్వయంగా ఎడిట్ చేసి వదిలింది.
Vastunnadu #BheemlaNayakOnHotstar.
Get ready for the ultimate battle of duty and power from 25th March. https://t.co/WpAm1tEKJc@PawanKalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @iamsamyuktha_ @MusicThaman @NavinNooli @dop007 @vamsi84 @DisneyPlusHSTel pic.twitter.com/8XDb7f27Ir
— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) March 17, 2022