telugu navyamedia
ఆంధ్ర వార్తలు

రాజ‌కీయాలు నాకు కొత్త కాదు..ఎంపీగా గెలిచే స‌త్తా నాకు ఉంది..

*రాజ‌కీయాలు నాకు కొత్త కాదు
*విజ‌య‌వాడ ఎంపీగా గెలిచే స‌త్తా నాకు ఉంది
*మా అన్న నానితో 30 ఏళ్ళుగా విభేదాలు ఉన్నాయి
* కేశినేని శ్వేత విష‌యంలో నేను అడ్డుప‌డ‌లేదు..

విజయవాడ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని కుటుంబంలో రాజకీయ వైరం మరింత ముదురుతోంది. తాజాగా కేశీనేని సోదరుడు కేశినేని శివనాథ్ (చిన్ని) వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా ఉత్కంఠ రేపుతోంది.

రాజ‌కీయాలు త‌న‌కు కొత్త కాదని, ఎంపీగా గెలిచే స‌త్తా త‌న‌కు ఉంద‌ని కేశీనేని చిన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.అన్న‌య్య నానితొ 30 ఏళ్ళుగా విభేదాలున్నాయ‌ని తెలిపారు. ఇటీవ‌ల కారు స్టిక్క‌ర్‌పై కేసు పెట్ట‌డం ఆయన విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తున్నాన‌ని చిన్ని పేర్కొన్నారు. అలాగే కేశినేని శ్వేత విష‌యంలో నేను ఎప్పుడూ అడ్డుప‌డ‌లేద‌ని అన్నారు. అన్న‌య్య నానికి వేన్నుపోటు పొడిచాన‌న‌డం క‌రెక్ట్ కాద‌ని అన్నారు.

చంద్ర‌బాబు సీఎం కావాల‌నే వ్యాపారం మానేసి రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని.. చంద్ర‌బాబు ఏ ప‌నిచేయ‌మంటే ఆ ప‌ని చేస్తాన‌ని చిన్ని స్ప‌ష్టం చేశారు.

ఇటీవ‌ల కొందరు తన పేరు హోదాను దుర్వినియోగం చేస్తున్నారని కేశీనేని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు చలామణి అవుతున్నారని.. తాను వినియోగించే వీఐపీ వాహన స్టిక్కర్ ను పోలిన నకిలీ స్టిక్కర్ వినియోగించి హైదరాబాద్, విజయవాడలో తిరుగుతున్నారన్నారు. అలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ ఈ ఏడాది మే 27న ఆయన పటమట పోలీసులకు ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే

Related posts