telugu navyamedia
ఆంధ్ర వార్తలు

జూమ్‌ కార్యక్రమంలోకి వైసీపీ వాళ్లు దొంగల్లా జొరబడ్డారు..

టెన్త్ రిజ‌ల్ట్స్ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ త‌ప్పుల కార‌ణంగా మ‌నోవేద‌న‌కు గుర‌వుతున్న విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రుల్లో భ‌రోసా నింపేందుకు నారా లోకేశ్ జూమ్ మీటింగ్ నిర్వ‌హించారని అచ్చెన్నాయుడు వెల్లడించారు. జూమ్‌ కార్యక్రమంలోకి వైసీపీ వాళ్లు దొంగల్లా జొరబడ్డారని విమర్శించారు. పిల్లల్ని భయపెట్టి జూమ్ కాన్ఫరెన్సులోకి వైసీపీ నేతలు వచ్చారని మండిపడ్డారు.

మా జూమ్ కాన్ఫరెన్సులోకి రావడం కాదు.. విద్యార్థులతో మంత్రి బొత్స జూమ్ కాన్ఫరెన్స్ పెట్టగలరా?.. మంత్రి బొత్స కాన్ఫరెన్స్ పెడితే.. విద్యార్థులు, తల్లిదండ్రులు జూమ్‌లోనే చీపుర్లతో కొడతారు.. ముఖాన ఉమ్మేస్తారు.. పదో తరగతి పరీక్షలు నిర్వహించలేని దద్దమ్మలు.. పనికి మాలిన వెధవలు జొరబడ్డారు.. వైసీపీది ఫేక్ పార్టీ అని నిరూపితం అయింద‌ని అన్నారు.

పదో తరగతి పాస్ కాని వెధవలు జూమ్ కాన్ఫరన్సులోకి వచ్చారు.. 2 లక్షల మంది విద్యార్థులు తప్పలేదా..?, కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చోసుకోలేదా..?, విద్యార్థులకు మనో ధైర్యం కల్పించాలని మేం కాన్ఫరెన్స్ పెడితే దొంగల్లా వచ్చారు.. విద్యార్ధులు తప్పలేదని.. ఆత్మహత్యలు చేసుకోలేదంటే మేం క్షమాపణ చెబుతామ‌ని అన్నారు.

జూమ్ కాన్ఫ‌రెన్స్‌లోకి వ‌చ్చిన వారిపై పోలీసులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

Related posts