telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం…

cm jagan ycp

ప్రస్తుతం మన దేశాన్ని కరోనా వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కరోనా కారణంగా అనాథలైన పిల్లలను రాష్ట్ర ప్రభుత్వాలు అదుకుంటున్నాయి. అలాంటి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక్కటి. అయితే తాజాగా కరోనాతో అనాధలుగా మారిన పిల్లలకు ప్రభుత్వం ఇచ్చే బీమా నిబంధనల్లో సవరణ చేశారు. తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు రూ. 10 లక్షల పరిహారం ఇచ్చే నిబంధనల్లో సవరణ చేశారు. ప్రభుత్వ బీమా లేని వారికి మాత్రమే రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలన్న నిబంధనను తొలగించారు. ఈమేరకు కలెక్టర్లు, వైద్యారోగ్య శాఖ కమిషనర్ కు.. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ నిబంధన తొలగింపుతో అదనంగా మరికొంత మంది పిల్లలకు ప్రయోజనం దక్కనుంది. ఈ నిర్ణయం పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related posts