telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

ఘట్‌కేసర్‌ రేప్‌ కేసు : ఆటో డ్రైవర్లకే క్షపమాణలు చెప్పిన పోలీసులు !

ఘట్‌కేసర్‌ లైంగికదాడి కేసులో సంచలన విషయాలు బయటపెట్టారు సీపి మహేశ్ భగవత్. ఘట్‌కేసర్‌కు చెందిన బీటెక్‌ విద్యార్థిని ఆటో డ్రైవర్లు అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే.. ఇవాళ ఈ కేసుపై సీపి మహేశ్ భగవత్ మాట్లాడుతూ సంచలన విషయాలు బయటపెట్టారు. పదవ తేదీ సాయంత్రం డయల్ 100 కు ఒక కాల్ వచ్చిందని.. ఐదున్నరకు రాంపల్లి బస్ స్టాప్ వద్ద కాలేజీ బస్సు దిగి ఆ అమ్మాయి ఆటోలో ఎక్కిందన్నారు. అక్కడ ఆమె దిగాల్సిన ప్రాంతంలో దిగకుండా తనను ఆటోలో కిడ్నాప్ చేశారంటూ తల్లికి ఫోన్ చేసిందని.. దీంతో కీసర, ఘట్కేసర్, మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లకు సంబంధించిన సిబ్బందిని అలర్ట్ చేసామని తెలిపారు. వెహికల్ చెకింగ్ మొదలుపెట్టామని.. అలాగే నిర్మానుష్యమైన ప్రాంతాల్లో గాలింపు మొదలుపెట్టామన్నారు. అమ్మాయి నెంబర్ కు చాలా సార్లు ఫోన్ చేశాము కానీ అమ్మాయి రెస్పాన్స్ ఇవ్వలేదు. 7.50 ఆ సమయంలోఆ అమ్మాయి రెస్పాన్స్ వచ్చింది. అప్పుడు లైవ్ లొకేషన్ ఇచ్చింది. లైవ్ లొకేషన్ ఆధారంగా అన్నోజిగూడ దగ్గరికి మా సిబ్బంది వెళ్లారు.
అక్కడికి వెళ్లేసరికి అమ్మాయి సగం డ్రెస్ తో ఉంది. అమ్మాయి సరిగ్గా మాట్లాడలేదు అపస్మారక స్థితిలో ఉన్నట్లు గా కనిపించింది. వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అమ్మాయి దొరికిన అన్నోజిగూడ ప్రాంతంలో దృష్టి పెట్టారు పోలీసులు. ఆ ప్రాంతంలో సెల్ టవర్ లొకేషన్ ట్రేస్ చేయడం మొదలుపెట్టారు. ఎక్కిన ఆటో గురించి ఆనవాలు అడిగాం. కొంచెం డామేజ్ అయిన ఆటో ఒక మూడు ఆటోలు గుర్తించాం. కొంత మంది ఆటో డ్రైవర్ ఫోటోలు చూపిస్తే అమ్మాయి వారిని గుర్తించింది. యువతి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్ ల పై కేసులు నమోదు చేశాం. తన పై ఆటో డ్రైవర్ లు రేప్ చేశారని మాకు స్టేట్ మెంట్ ఇచ్చింది. రేప్ జరిగిందా లేదా అనే విషయం పై హాస్పిటల్ లో టెస్ట్ లు చేయించాం. తన పై కర్రలతో దాడి చేశారని యువతి తెలిపింది. ఆటో వాళ్లను అదుపులోకి తీసుకుని విచారించాం. సైంటిఫిక్ దర్యాప్తు లో ఆటో డ్రైవర్ తప్పు లేదు అని తేలింది. అమ్మాయి రేప్ జరిగింది అని చెప్పిన సమయానికి ఆటో డ్రైవర్ ఒక మల్టీప్లెక్స్ కి వెళ్ళారు. అన్ని సీసీ టీవీ లు పరిశీలించాక ఆటో డ్రైవర్ చెప్పింది నిజం అని తేలింది. అమ్మాయి పోలీసులను తప్పు దోవ పట్టించింది. యన్నం పేట్ దగ్గర అమ్మాయి ఆటో దిగిన సీసీ ఫుటేజ్ మాకు దొరికింది. యన్నంపేట్ నుండి అంజో జి గూడా వరకు 100 సీసీ ఫుటేజ్ లు చూశాం. ఈ కేసు లో సీసీ ఫుటేజ్ లు కీలక ఆధారాలుగా మారాయి. యాన్నం పేట్ నుండి 4 కిలో మీటర్ లు అమ్మాయి నడిచింది.. ఈ కేస్ లో ఆటో డ్రైవర్ ల కు ఎలాంటి సంబంధం లేదు. ఆటోడ్రైవర్లకు క్షమాపణలు చెబుతున్నాం. విచారణ తర్వాత తన పై ఎలాంటి రేప్ జరగలేదని అమ్మాయి చెప్పింది. అమ్మాయి కి ఇంట్లో నుండి వెళ్లిపోవాలని ఎప్పటి నుండో ఉంది. 6 నెలల క్రితం తన ఫ్రెండ్ కి ఇంకో కిడ్నాప్ కథ చెప్పింది… అమ్మాయికి కిడ్నాప్ లు అంటే ఒక రకమైన ఇష్టం” అని సీపీ మహేష్‌ భగవత్‌ పేర్కొన్నారు.

Related posts