telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీ మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు ముహుర్తం ఖరారు

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో భేటీ ముగిసింది. రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని తాడేపల్లి చేరుకున్న సీఎం జగన్‌.. ఇవాళ సాయంత్రం రాజ్‌భవన్‌ వెళ్లి గవర్నర్ విశ్వభూషణ్‌తో భేటీ అయ్యారు.. దాదాపు 45 నిమిషాలపాటు సమావేశం కొనసాగింది.

ఈ సందర్భంగా మంత్రి వర్గ పునర్‌ వ్యవస్థీకరణ ఏర్పాటుపై గవర్నర్‌తో సీఎం జగన్‌ చర్చించారు. పాలనా వికేంద్రీకరణలో భాగంగా నూతన జిల్లాల ఏర్పాటు విషయాన్ని సీఎం జగన్‌ గవర్నర్‌కి వివరించారు.

ఈ నెల 11న మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు గవర్నర్‌కి తెలిపిన ఆయన.. అదే రోజు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని కోరారు. ఇందుకు సంబంధించి నూతన మంత్రుల జాబితా రెండు రోజుల్లో అందజేయనున్నట్లు వెల్లడించారు.

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశాలను గవర్నర్‌కు వివరించి.. ఈ నెల 11వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి గవర్నర్ అపాయింట్‌మెంట్‌ ఖరారు చేయాల్సిందిగా కోరారు.

మరోవైపు, ఏపీ పాత కేబినెట్‌ రేపు సమావేశం కానుంది.. సాయంత్రం 3 గంటలకి కేబినెట్‌ భేటీ ప్రారంభం కానుంది.

అంతకుముందు రాజ్ భవన్ వద్ద సీఎం వైఎస్ జగన్‌కు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా, ఇతర ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు.

Related posts