telugu navyamedia
వార్తలు

మ‌ళ్ళీ పెరిగిన కరోనా కేసులు..

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 15.92లక్షల మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించగా.. 33,376 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,32,08,330కు చేరింది. ఇందులో 3,91,516 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 4,42,317 మంది బాధితులు మరణించారు. మరో 3,23,74,497 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 308 మంది మరణించారని, 32,198 మంది బాధితులు మహమ్మారి నుంచి బయటపడ్డారని తెలిపింది.

India's COVID-19 cases cross 1.2 million, total deaths close to 30,000 - Xinhua | English.news.cn

అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిన‌ట్టు.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ విడుద‌ల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 67,911 శాంపిల్స్‌ పరీక్షించగా.. 1,608 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో ఆరుగురు కోవిడ్‌ బాధితులు మృతిచెందారు.. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు చొప్పున, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్కరు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 1,107 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు..

Andhra Pradesh imposes 14-day partial lockdown starting 5 May as COVID-19 cases surge-India News , Firstpost

దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,27,650కి చేరుకోగా.. రికవరీ కేసులు 19,98,561కు పెరిగాయి. ఇక, ఇప్పటి వరకు కోవిడ్‌ బారినపడి మృతిచెందినవారి సంఖ్య 13,970కు పెరిగితే.. ప్రస్తుతం రాష్ట్రంలో 15,119 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని.. రాష్ట్రంలో పరీక్షించిన శాంపిల్స్‌ సంఖ్య 2,72,29,781కు చేరిందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. తాజా కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 281, నెల్లూరులో 261, తూర్పు గోదావరిలో 213 కేసులు వెలుగుచూశాయి.

Coronavirus News Highlights: Kerala reports 31,265 cases; night curfew to be imposed from Monday, says CM Pinarayi Vijayan - The Financial Express

కాగా.. కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. దేశవ్యాప్తంగా 73,05,89,688 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్యశాఖ ప్రకటించింది.

Related posts