telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

ఆన్‌లైన్ క్లాసుల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ!

high court on new building in telangana

ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. విద్యాసంవత్సరం ప్రారంభించలేదని విచారణ సందర్భంగా కోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు. క్యాబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఇంకా నిర్ణయం తీసుకోనప్పుడు ఆన్‌లైన్ క్లాసెస్ ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

ఆర్థికంగా వెనుకబడిన వారు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఎలాంటి న్యాయం జరుగుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. లిఖితపూర్వకంగా ఈనెల 13న నిర్దిష్ట ప్రణాళిక కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది.

Related posts