telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

వారందరు వ్యాక్సిన్ తీసుకోవాలని ఈటల విజ్ఞప్తి…

మన దేశంలో ఈ ఏడాది ఆరంభం నుండి కరోనా వ్యాక్సిన్ ఇస్తున్న… అందులో ఓ పద్దతి ప్రకటిస్తుంది కేంద్రం. అయితే ఈరోజు నుంచి 45 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ అందిస్తున్నారు.. దానికి తగినట్టుగా ఏర్పాట్లు కూడా చేసింది ప్రభుత్వం.. అయితే, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో వాక్సిన్ అందిస్తున్న విధానంపై సమీక్ష నిర్వహించారు మంత్రి ఈటల రాజేందర్… ఈ రోజు నుండి 45 సంవత్సరాలు పైబడిన వారందరికీ వాక్సిన్ అందిస్తున్నామని ఈ సందర్భంగా వెల్లడించిన ఆయన.. ఇప్పటి వరకు మెడికల్ కాలేజీల్లో.. టీవీవీపీ ఆసుపత్రుల్లో మాత్రమే వాక్సిన్ అందిస్తుండగా.. ఈ రోజు నుండి ప్రాథమిక అరోగ్య కేంద్రాలలో సైతం వాక్సిన్ అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. ప్రజలందరూ విథిగా వాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేసిన ఆయన.. కరోనా వైరస్‌ను అరికట్టడానికి ప్రస్తుతం వాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గమని సూచించారు.. అంతేకాదు.. కరోనా బారినపడకుండా.. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం మరవొద్దని గుర్తుచేశారు మంత్రి ఈటల.

Related posts