telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

మెడికల్ షాపులను అప్రమత్తం చేసిన తెలంగాణ సర్కార్…

85% medical students failed in entrance test

తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మెడికల్ షాపులను అప్రమత్తం చేసింది సర్కార్. మెడికల్ షాపుల్లో నో మాస్క్ నో మెడిసిన్ అమలు చేయాలని ఆదేశాలు. మాస్క్ ఉంటేనే మందులు. దగ్గు జ్వరం లక్షణాలతో వచ్చే వాళ్లకు డాక్టర్ చిట్టి లేకుండా మందులు అమ్మొద్దు. లక్షణాలున్న వాళ్ళను ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్ళమని సూచించాలి అని పేర్కొంది. ఇక హైదరాబాద్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యం లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది జీహెచ్‌ఎంసీ. పబ్లిక్ ప్లేసెస్ లో మాస్కు తప్పనిసరి. ఎవ్వరూ గుమ్మిగుడ వద్దు. అందరూ 6 అడుగుల దూరం పాటించాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మకూడదు. ఒక వేళా అలా ఉమ్మితే ఫైన్. మాస్కు లేక పోతే ఉద్యోగులు అయినసారే జీహెచ్‌ఎంసీ ఆఫీస్ లకు అనుమతి లేదు. సిబ్బంది ఆఫీస్ లోపలికి వచ్చినప్పుడు , బయటకు వెళ్ళేటప్పుడు చేతులు శానిటేషన్ చేసుకోవాలి అని పేర్కొంది. అయితే ఇప్పటికే జీహెచ్‌ఎంసీ కార్యాలయాలకు సందర్శకుల నో ఎంట్రీ. అయితే చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts