ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభానికి ముందే కోల్‌కతా నైట్‌రైడర్స్ కు భారీ షాక్ తగిలింది. కేకేఆర్ స్టార్ బ్యాట్స్‌మన్ నితీష్ రాణాకు కరోనా సోకింది. గురువారం రాణాకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం రాణా ముంబైలోని కేకేఆర్ టీమ్ బసచేస్తున్న హోటల్‌లో క్వారెంటైన్‌లో ఉన్నాడు. వైద్యులు నిరంతరం ఆయను పరీక్షిస్తున్నారు. అయితే రాణాకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని సమాచారం. అయితే సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ మరియు విజయ్ హజారే ట్రోఫీ రెండింటిలోనూ ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన నితీష్ రాణా.. ఇటీవల గోవాకు వెళ్లాడు. అక్కడ సేదతీరిన అతడు.. రెండు రోజుల క్రితం కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో కలిశాడు. జట్టుకు రిపోర్ట్ చేసే సమయంలో కరోనా టెస్ట్ చేయగా రాణాకు నెగటివ్ రిపోర్ట్ రాగా.. తాజాగా ఫలితాల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో హోటల్‌లో క్వారెంటైన్‌లో ఉన్నాడు. సీజన్ ప్రారంభానికి ముందే రాణా కరోనా బారిన పడడంతో మొదటి మ్యాచ్ ఆడడం అనుమానంగానే ఉంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 11న సన్‌రైజర్స్‌తో కోల్‌కతా ఆడనుంది. అయితే చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
previous post