telugu navyamedia
రాజకీయ వార్తలు

లోక్‌సభలో రఫేల్‌ రగడ..సెప్టెంబర్‌లో తొలి విమానం!

Nirmala Sitaraman Responds On Rafale

రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంపై శుక్రవారం కూడా లోక్‌సభలోవాడివేడి చర్చ జరిగింది.  యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారం పై దేశాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుదోవ పట్టిస్తోందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. లోక్ సభలో  ఆమె మాట్లాడుతూ భారత్‌ కొనుగోలు చేసిన తొలి రఫేల్‌ యుద్ధ విమానం 2019 సెప్టెంబరు నెలలో దేశానికి వస్తుందని వెల్లడించారు. మిగిలిన విమానాలు 2022 నాటికి అందుబాటులో ఉంటాయని తెలిపారు.

దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని మన ప్రాధాన్యతలకు అనుగుణంగా రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుంటామని స్పష్టం చేశారు. అనిల్‌ అంబానీ కోసమే తాము యుద్ధ విమానాలు కొనుగోలు చేశామని కాంగ్రెస్‌ భావిస్తే యూపీఏ హయాంలో జరిగిన ఒప్పందాల వెనుక ఖత్రోచీ, రాబర్ట్‌ వాద్రాలు ఉన్నారంటూ నిర్మలా సీతారామన్‌ దుయ్యబట్టారు. ప్రధాని మోదీ పట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు అభ్యంతరకర పదజాలం వాడారని, వాయుసేన అధిపతిని సైతం అబద్ధాలకోరుగా చిత్రీకరిస్తున్నారని సీతారామన్‌ పేర్కొన్నారు.

Related posts