telugu navyamedia
క్రీడలు వార్తలు సామాజిక

క్రిస్మస్ తాత అవతారమెత్తిన విరాట్ కోహ్లీ

crismas virat khoili

క్రిస్మస్ పర్వదినం రానున్న నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రిస్మస్ తాత అవతారమెత్తాడు. అనాథ చిన్నారుల ముఖాల్లో వెలుగులు నింపేందుకు కోహ్లీ తనవంతుగా కాస్త సమయం కేటాయించాడు. క్రిస్మస్ తాత శాంటాక్లాజ్ వేషంలో వచ్చిన కోహ్లీ కోల్ కతాలోని ఓ అనాథాశ్రమం చిన్నారులకు అనేక కానుకలు తీసుకువచ్చాడు.

క్రిస్మస్ తాతలా ఎంట్రీ ఇచ్చిన కోహ్లీ ఆపై మేకప్ తీసేయడంతో బాలబాలికలు ఆనందోత్సాహాలతో ఒక్కసారిగా చుట్టుముట్టారు. కోహ్లీ కూడా వారితో ఎంతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ పండుగను ముందే సెలబ్రేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts