ఆగ్ర రాజ్యం అమెరికా పై ఉగ్రసంస్థ అల్ కాయిదా నిప్పులు చెరిగింది. 2001, సెప్టెంబర్ 11 ఉగ్రవాడులకు నిన్నటితో 18 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో అమెరికా, దాని మిత్రదేశాలు, యూరప్, ఇజ్రాయెల్ లపై దాడులకు దిగాలని ముస్లింలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు అల్ కాయిదా అధినేత అల్ జవహరి ఓ వీడియో సందేశం విడుదల చేశాడు. అందులో 2001 ఘటన తర్వాత ఉగ్రవాదాన్ని వదిలేసినవారిపై జవహరి విమర్శించారు. అమెరికా మిలటరీనే లక్ష్యంగా చేసుకోవాలనుకుంటే ప్రపంచవ్యాప్తంగా వారి సైనిక స్థావరాలు ఉన్నాయని గుర్తుచేశాడు.
గోలన్ హైట్స్ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ కు చెందినదిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గుర్తించడంపై జవహరి ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాలస్తీనా ప్రజలు ఇజ్రాయెల్ దురాక్రమణకు ప్రతీకారంగా ఆత్మహుతి దాడులకు పాల్పడాలని పిలుపునిచ్చాడు. అమెరికా నేవీ సీల్స్ బలగాలు పాక్ లోని అబోటాబాద్ లో 2011లో అల్ కాయిదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ను హతమార్చింది. దీంతో ఈ ఉగ్రసంస్థలో ఉన్న అల్ జవహరి అల్ కాయిదా అధినేతగా బాధ్యతలు స్వీకరించాడు.
ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కుటుంబం కన్ను: ఎంపీ కోమటిరెడ్డి