telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

బాక్సింగ్ చేస్తున్న కంగనా.. అందుకేనా..?

బాలీవుడ్ లో కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ప్రస్తుతం తన నూతన సినిమా ధాకద్‌ కోసం కష్టపడుతోంది. అయితే ఈ సినిమాతో పాటు కంగానా మరో సినిమా షూటింగ్‌లోనూ పాల్గొంటోంది. ఒకే సారి ధాకద్‌తో పాటు తలైవి సినిమాలను చేస్తోంది. అయితే కంగనా ఇటీవల తన నూతన సినిమా కోసం కష్టపడుతున్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట చేసింది. అందులో ఆమె బాక్సింగ్ చేస్తూ కనిసిస్తోంది. ఈ సినిమా యాక్షన్ డైరెక్టర్స్ జాసన్ ఎన్‌జీ, బ్రెట్ చాన్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. దానితో పాటుగా కంగనా తాను ఎలా మల్టీటాస్కింగ్ చేస్తోంది, దాంతో పాటుగా ధాకద్‌కు తయారవుతుంది చెప్పింది. ఆమె తలైవి కోసం హైదరాబాద్‌ షూటింగ్‌లో కూడా ధకాద్ కోసం కష్టపడింది. ‘నాకు మల్టీటాస్క్ అంటేనే పడదు, కానీ ఇటువంటి సమాయాల్లో నేను నా పాత రోజులకు వెళ్లాలి. ఎప్పడైతే నేను రోజులో 24 గంటల పనిచేయడానికి సిద్దంగా ఉన్నానో అలా చేసుకోవాలి. తలైవికి కావలసిన యాక్షన్ సీన్‌లకు సిద్దం అవుతున్నాన’ని ఆమె తెలిపింది. అయితే తలైవి, ధకాద్‌లతో పాటు కంగనా పాట్రియాటిక్ సనిమా తేజస్‌కూ సిద్దం అవుతుంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందా… లేదా నేది చూడాలి.

Related posts