telugu navyamedia
రాజకీయ

జాతీయ జెండాను ప్రొఫైల్‌ పిక్చర్‌గా పెట్టుకోండి​‍ -దేశ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని పిలుపు

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న క్రమంలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా ఆగస్టు 2 నుంచి 15 తేదీ వరకు ప్రజలందరూ తమ సోషల్ మీడియా అకౌంట్ల ప్రొఫైల్ పిక్​గా జాతీయ జెండా ఫొటోను పెట్టుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పిలుపునిచ్చారు.

ఈ మేర‌కు 91వ ‘మన్‌ కీ బాత్‌’ కార్య‌క్ర‌మం ద్వారా  దేశప్రజలతో  సంభాషించారు . నేటీ  ‘మన్ కీ బాత్’ చాలా ప్రత్యేకమైనదని, భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకోను సంద‌ర్భంగా నిర్వ‌హిస్తున్న‌ వేడుక‌లు చారిత్రాత్మక క్షణానికి సాక్ష్యంగా నిలుస్తాయని ప్రధాని మోదీ అన్నారు. 

జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్యను స్మరించుకున్నారు. ఆయ‌న‌ జయంతి ఆగస్టు 2న కావున ఆయనకు నా గౌరవప్రదమైన నివాళులు అర్పిస్తున్నానని అన్నారు. 

75 ఏళ్ల స్వాతంత‍్య్రానికి గుర్తుగా దేశంలోని 75 రైల్వే స్టేషన్లకు స్వాతంత్య్ర సమరయోదుల పేర్లు పెట్టినట్లు గుర్తు చేశారు. అలాంటి స్టేషన్లను పిల్లలు సందర్శించాలని సూచించారు.

ఆజాదీకా అమృత్‌ మహోత్సవం ఒక ఉద్యమంగా సాగుతుండటం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో ప్రతిఒక్కరు భాగస్వాములై.. ఆగస్టు 2-15 వరకు తమ ప్రొఫైల్‌ పిక్చర్‌గా మువ్వన్నెల జెండాను పెట్టుకోవాలి.

ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు ‘హర్​ ఘర్​ తిరంగా’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నాం.. ఆ మూడు రోజులు.. మీ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలి.’ అని ప్రజలను ప్రధాని మోదీ ప్రజలను కోరారు.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో మనమందరం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక ఘట్టాన్ని చూడబోతున్నామ‌ని అన్నారు .

Related posts