ఏపీలో ప్రస్తుతం పంచాయితీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అక్కడ పార్టీలు అని దీని పైనే దృష్టి పెట్టాయి. అయితే ఈ పంచాయతీ ఎన్నికలు సగం పూర్తి అయ్యాయి. అంటే రెండు విడతల ఎన్నికలు పూర్తి కాగా మూడో విడత ఎన్నికల కోసం సిద్దం అవుతున్నారు. సీఎస్‌కు వరుసగా లేఖలు పంపి.. రాష్ట్ర రాజకీయాలనే మలుపు తిప్పుతున్న ఆయన ఇంటింటికి రేషన్ సరఫరా వాహనాల వినియోగంపై ఆంక్షలు విధించారు. రేషన్ సరఫరా వాహానాలకు రంగులు మార్చాలని ఆదేశించారు. ఏ పార్టీలకు చెందని రంగులు వేసి కమిషన్ పరిశీలనకు తీసుకురావాలని సివిల్ సప్లైస్ శాఖ ఉన్నతాధికారులకు సూచనలు చేశారు. అప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ సరఫరా వాహానాల వినియోగం నిలిపేయాలని ఎస్ఈసీ ఆదేశించారు. అయితే దీని మీద ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో రేషన్ వాహనాల విషయంలో ఎన్నికల ఎస్ఈసి ఆదేశాల పై హైకోర్టు స్టే విధించింది. మార్చి 15 వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని హైకోర్టు పేర్కొంది. చుడాలిమరి ఇప్పుడు నిమ్మగడ్డ ఏం చేస్తాడు అనేది.
previous post
next post
జగన్ తానేదో పెద్ద స్పెషలిస్ట్ అనుకుంటున్నాడు: తులసిరెడ్డి