telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

శుక్రవారం ఎన్‌టిఆర్‌ భవన్‌లో సీబీఎన్‌ వారియర్స్‌: ఎన్నికల ప్రచారంలో వీడియో పాటలు విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు.

శుక్రవారం ఎన్‌టిఆర్‌ భవన్‌లో సీబీఎన్‌ వారియర్స్‌ మరియు గుమ్మడి గోపాలకృష్ణ ప్రొడ్యూస్‌ చేసిన వీడియో పాటల విడుదల ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాలుగు వీడియో పాటలను విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు మరియు రాజకీయ కార్యదర్శి టి.డి. జనార్థన్‌.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధులు నన్నూరి నర్సిరెడ్డి, తిరునగరి జ్యోత్స్న, నిర్మాతలు కె.ఎస్‌. రామారావు, గుమ్మడి గోపాలకృష్ణ, కొడాలి వెంకటేశ్వర్‌ రావులు అతిథులుగా పాల్గొని పాటల వీడియోను విడుదల చేశారు.

ఈ సందర్భంగా పొలిట్‌బ్యూరో సభ్యులు, టి.డి. జనార్థన్‌ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికల దృష్ణా ఏపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలలో చేసిన అరాచకం, ప్రజలను వేధించిన విధానం, భావితరాలకు ధన, మాన రక్షణ కరవైంది.

కనుక ఏపీ లోని ఈ పరిస్థితులకు చలించిన కొంత మంది సినీ ప్రముఖులు కొన్ని పాటలను రూపొందించారు. కె.ఎస్‌. రామారావు, కొడాలి వేంకటేశ్వర్‌ రావులు కలిసి రెండు పాటలను రూపొందించారు.

గుమ్మడి గోపాలకృష్ణ గారు ఇంతకుముందే 12 పాటలను రూపొందించి ఉన్నారు. ఇప్పుడు 13వ పాటను రూపొందించి ఆ పాటను పాడటం కూడా జరిగింది.

ఈ పాటలను రూపొందించడంలో పాత్ర వహించిన ప్రతి ఒక్కరికీ అభినందనలను తెలియజేస్తున్నాను.

జాతీయ అధికార ప్రతినిధి, నన్నూరి నర్సిరెడ్డి మాట్లాడుతూ.. ఇటువంటి అద్భుతమైన పాటలను వినే అదృష్టం నాకు కలిగిందని అన్నారు. వినడం, చూడటం ద్వారా సమాజంలో చాలా ప్రభావాన్ని చూపెట్టే అవకాశంఉంటుంది.

జనం పడుతున్న అనేక రకాల ఇబ్బందులను ప్రతిదీ కూడా స్పష్టంగా మన కళ్లకు కనిపించే విధంగా, చెవులలో మారుమ్రోగే విధంగా రాసి పాడిన వారికి, నటించిన వారికి ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలను తెలియజేస్తున్నాను.

కొన్ని పాటలు ప్రభుత్వాన్నే మార్చిన పరిస్థితులను చూశాం. జనం కోసం, జాతి కోసం, పేదల కోసం, బీదల కోసం నిరంతరంగా శ్రమిస్తున్నారు.

శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపర్చడం కోసం తనకు తోచిన విధంగా సహకరిస్తున్న ప్రతివ్యక్తికి, పెద్దలందరికీ పేరుపేరున ధన్యవాదాలను తెలియజేస్తున్నాను.

జాతీయ అధికార ప్రతినిధి, తిరునగరి జ్యోత్స్న మాట్లాడుతూ.. ఏపీ ఎదుర్కొంటున్న పరిస్థితులను చూపించి ఏపీలో ప్రజా పరిపాలన రావాలనే ఉద్దేశంతో ప్రతి వర్గం కృషి చేస్తున్నది.

రాష్ట్రం బాగు కోసం చలన చిత్ర రంగం తమ వంతు బాధ్యతగా చేయాలని కంకణబద్దులై పని చేస్తున్నారు. ఈ పాటలు ప్రతి వర్గం ఏమి బాధలు పడుతున్నారో ఆ బాధలను తీర్చగలిగే నాయకుడు ఎవరు? అని ఈ పాటలు మనసుకు హత్తుకునే విధంగా ఉన్నాయి.

పాటలను ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ఏపీలోని వైసీపీ ఐదు సంవత్సరాల పాలనకు ఏ పేరు పెట్టాలో పదం కూడా లేదు.

అటువంటి ప్రభుత్వం గద్దె దిగాల్సిందే, ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి రావాల్సిందే. ఈ బృహత్తర ఆలోచన చేసిన పెద్దలందరికీ నమస్కారములు.

ప్రముఖ నిర్మాత, కె.ఎస్‌. రామారావు మాట్లాడుతూ.. ఇంత మంది, ఇంత ఇన్సిపిరేషన్‌తో పాటలను రాసి, తీయడానికి ప్రధాన కారణం 45 డిగ్రీల ఎండలలోనూ చంద్రబాబు గారు ఏపీ ప్రజల కోసం కష్టపడుతుండటమే.

చంద్రబాబు గారి శ్రీమతి భువనేశ్వరి గారు, కుమారుడు నారా లోకేష్‌ గారు, నందమూరి బాలకృష్ణ గారు, పవన్‌కళ్యాణ్‌ గారు మండుటెండల్లో ఏపీ బాగుండాలని కష్టపడి పని చేస్తున్నారు. ఆ ఎండల ప్రభావం ఇక్కడ ఉండే మనకు తెలియదు.

ఆ మండుటెండలు ఏపీలోకి వెళ్లి చూస్తే అవి ఎలా ఉంటాయో తెలుస్తుంది. అంత వయసులో మండుటెండలో చంద్రబాబు గారు తిరుగుతుండటం చూసి స్ఫూర్తిని పొంది కొడాలి వేంకటేశ్వర్‌ రావు, గుమ్మడి గోపాలకృష్ణ గారు ముందుకు వచ్చి చేశారు.

దేశానికి నాయకుడు కావాల్సిన చంద్రబాబు గారు ఆయనకు ఆయనను తగ్గించుకుని రాష్ట్రం కోసం పని చేస్తున్నారు.

అటువంటి మనిషి ఏపీని అభివృద్ధి చేసుకుందామని ప్రజలను రిక్వెస్ట్‌ చేసుకుంటుంటే బాధ కలుగుతున్నది (భావోద్వేగానికి గురయ్యారు).

ఏపీలో ఇంత దరిద్రపు పాలనను ఎవరూ ఊహించలేరు. చంద్రబాబు గారి స్ఫూర్తితో ఉడతా భక్తిగా సహాయం చేయాలనే ఉద్దేశంతో, టి.డి. జనార్థన్‌ గారి ప్రోత్సాహంతో ఈ పాటలను మీ ముందుకు తీసుకొస్తున్నాం.

వీటిని మీడియా ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం తీసుకురావాలి. ఏపీని బాగు చేసుకోవడానికి చంద్రబాబుగారికి మీ అందరి సహకారం కావాలి. ఆయనను గెలిపించుకోవడం మన అందరి బాధ్యత. కొడాలి వేంకటేశ్వర్‌ రావు టీంకు ధన్యవాదాలు.

నిర్మాత, కొడాలి వేంకటేశ్వర్‌ రావు మాట్లాడుతూ.. ఈ పాటలను ముఖ్యంగా టి.వి. పరిశ్రమ వారు, వర్కర్సు చేసినవి.

ఈ కార్యక్రమాన్ని మొదట హేమంత్‌ అనే వ్యక్తి ప్రారంభించారు. నేను, కె.ఎస్‌. రామారావు గారు చేసింది తక్కువ. నాని, చక్రి, అశోక్‌, శ్రీనివాస్‌ వంటి వారు వెనుక ఉండి ఈ కార్యక్రమాన్ని షూట్‌ చేశారు. దీనిని డైరెక్టుగా షూట్‌ చేసి సాంగ్స్‌ ను చేశాం.

ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా పాటలను చేయడం జరిగింది. 175 నియోజకవర్గాలకు వీటిని రీఎడిట్‌ చేసి ప్రతి నియోజకవర్గానికి పనికివచ్చే విధంగా చేయబోతున్నాం.

నిర్మాత, గుమ్మడి గోపాల కృష్ణ (రంగస్థల నటుడు) మాట్లాడుతూ.. రంగస్థల నటుడిగా మీరందరికీ నేను పరిచయమే.

రంగస్థల నటుడిగా మీ అందరి గుర్తింపు పొందడం నా పూర్వ జన్మ సుకృతం. రంగస్థల నటులకు తొలిసారిగా నంది అవార్డులను ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కింది.

అలాగే ఉగాది పురస్కారాలు హంస పురస్కారాలు, ఎన్‌టిఆర్‌ అవార్డులు ఇవ్వడమే కాక వేదిక మీద 150 మందికి అవార్డులను ఇవ్వాల్సి వస్తే వారందరికీ చివరి మనిషి కూడా ఇచ్చి కళాకారులను గౌరవించి కళలను అభివృద్ధి చేసిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు.

అటువంటి వ్యక్తి మీద ఎటువంటి నిందలు, నీలాప నిందలు వేస్తున్నారో మీకందరికీ తెలిసిందే.

అసలు చంద్రబాబు గారు అనే వ్యక్తి లేకపోతే అభివృద్ధి, రాష్ట్రం ఏమైపోతుందో అని ఆలోచించుకుంటే మనకు వచ్చే సమాధానం కూడా మీకు తెలిసిందే.

అందుకనే చంద్రబాబుగారి వ్యక్తిత్వం మీద ప్రత్యేకంగా ఆయన గుణగణాల మీద పాట రాయడం జరిగింది.

ఆ రోజు అలిపిరి ఘటనలో వేెంకటేశ్వర స్వామి ఎందుకు దిష్టి తీసి వజ్రకాయుడిని చేశాడో, భగవంతుడు ఇచ్చిన శరీరాన్ని ఏ రకంగా తను సంక్షేమం, అభివృద్ధి కోసం ఆయన అంకితం చేశారో నా పాటలో నేనే రాసుకుని, నేనే గానం చేసి మీరందరికీ అందిస్తున్నాను.

ఈ పాటలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మీకు వినయపూర్వకంగా అర్థిస్తున్నాను. ఈ పాటలను ప్రజల్లోకి తీసుకెళ్తే చంద్రబాబు గారు ఎంత గొప్పవారో తెలుస్తుంది.

టి.వి. వర్కర్స్‌ ఛైర్మన్‌, నాని మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో భాగం కల్పించినందుకు కొడాలి వేంకటేశ్వర్‌ రావు గారికి ధన్యవాదములు. అందరూ స్వతహాగా వచ్చి పని చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మీడియా కమిటీ ఛైర్మన్‌ తెలుగుదేశం ప్రకాష్‌ రెడ్డి, శిరీషా, సీబీఎన్‌ వారియర్స్‌, ప్రకాశ్‌ రెడ్డి పాల్గొన్నారు.

Related posts