ఈరోజు ఉదయం ఆరున్నర గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకూ ఏపీలో పోలింగ్ జరగనుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు .ఇప్పటికే చాలా కేంద్రాలకు పోలింగ్ సామగ్రి చేరింది. పోలింగ్ విధులు నిర్వహించేందుకు…. సిబ్బంది కేంద్రాలకు చేరుకుంటున్నారు. నాలుగు విడతల్లో జరిగే పంచాయతీ ఎన్నికలకోసం.. జనవరి 23న ఎస్‌ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 29 నుంచి 31 వరకు తొలి విడత ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించిన ఎన్నికల అధికారులు… ఆ ప్రక్రియను ఫిబ్రవరి నాలుగో తేదీనాటికి పూర్తి చేశారు. పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశారు. తొలివిడత పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం మధ్యాహ్నం పోలింగ్ పూర్తికాగానే.. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. ఫలితాల ప్రకటన వెలువడిన తర్వాత ఉపసర్పంచ్ ఎంపికకు ఓటింగ్ నిర్వహిస్తారు. అయితే ఈ ఎన్నికల్లో తొలిసారి నోటా ప్రవేశపెట్టారు. పోలింగ్ కేంద్రాల దగ్గర పటిష్టభద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. ఇప్పటికే జిల్లాల్లో పర్యటించిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. పోలింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
previous post
next post