టీమ్ ఇండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవస్కర్… 1981 లో జరిగిన ఆసీస్ సిరీస్ లో వాకౌట్‌పై స్పందించాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు గెట్ ఔట్ అన్నందుకే 1981 సిరీస్‌లో వాకౌట్ చేశామని గవస్కర్ తెలిపాడు. అంపైర్ ఎల్బీడబ్ల్యూ నిర్ణయంపై అసంతృప్తితో వాకౌట్ చేశామనడంలో నిజం లేదని చెప్పాడు. 1981లో మెల్‌బోర్న్ టెస్టులో డెన్నిస్ లిల్లీ ఇన్ కట్టర్ బంతి గావస్కర్ ముందు ప్యాడ్‌ను తాకింది. బంతి బ్యాటును తాకినా అంపైర్ రెక్స్ వైట్‌హెడ్ మాత్రం ఎల్బీగా ఔటిచ్చాడన్న కోపంతో గావస్కర్ చాలాసేపు మైదానంలోనే ఉండి నిరసన తెలిపాడు. చేతన్ చౌహాన్‌ను దాటుకుని డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తుండగా ఆసీస్ ఆటగాళ్లు నోటి దురుసు ప్రదర్శించారు. తనన్ను బయటికెళ్లు అన్నారని చెప్పాడు గవాస్కర్. దీంతో గావస్కర్‌తో పాటే చేతన్ డ్రెస్సింగ్ రూమ్ వైపు కదిలాడు. బౌండరీ తాడు దగ్గర అప్పటి మేనేజర్ షాహిద్ దురాని, సహాయక మేనేజర్ బాపు నద్‌కర్ణిలు బ్యాట్స్‌మెన్‌తో మాట్లాడటంతో గొడవ సద్దుమణిగింది. అయితే ప్రస్తుతం భారత జట్టుకూడా ఆసీస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.
previous post